నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020పై భాజపా అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్దు వల్ల పన్ను చెల్లింపు దారులకు అసాధారణ రీతిలో ఉపశమనం కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్రం సంకల్పానికి ఈ బడ్జెట్ ఎన్నో విధాలుగా దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు.
"రైతులు, పేద, మధ్య తరగతి, వ్యాపార వర్గాలు లబ్ధిపొందే విధంగా బడ్జెట్‌ను రూపొందించిన ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు నా అభినందనలు. ధాన్యం నిల్వ, నీటిపారుదలలో విధించిన నిబంధనలు.. రైతుల ఆదాయన్ని రెట్టింపు చేయాలన్న మోదీ ప్రభుత్వ సంకల్పానికి దోహద పడతాయి. మౌలిక వసతులకు ఊతమివ్వడం, సహేతుకమైన పన్ను వ్యవస్థ, సులభతర వాణిజ్యంలో పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు... భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడతాయి."
--- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
పద్దుతో భారత్ వృద్ధి...