తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలోనూ ఎన్​ఆర్​సీ చేపట్టనున్న ప్రభుత్వం!

కర్ణాటకలో ఎన్​ఆర్​సీ (జాతీయ పౌర రిజిస్ట్రీ) తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్​ బొమ్మై ఈ విషయం వెల్లడించారు.

కర్ణాటకలోనూ ఎన్​ఆర్​సీ చేపట్టనున్న ప్రభుత్వం!

By

Published : Oct 3, 2019, 3:34 PM IST

అసోంలో ఎన్​ఆర్​సీ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం... దేశవ్యాప్తంగా తెచ్చి తీరతామని స్పష్టం చేసింది. తాజాగా కర్ణాటకలోని భాజపా ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ చేపడతామని ప్రకటించింది. అక్రమ వలసదారులను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోం మంత్రి బసవరాజ్​ బొమ్మై తెలిపారు.

"దేశవ్యాప్తంగా ఎన్​ఆర్​సీ చేపడతారంటూ పెద్ద చర్చ నడుస్తోంది. అందులో కర్ణాటక కూడా ముఖ్యమైన రాష్ట్రం. ఇక్కడకు ఎంతోమంది విదేశీయులు వచ్చి స్థిరపడ్డారు. వారి వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. కేంద్ర హోంమంత్రిని సంప్రదించి ముందుకు వెళ్తాం."

- బసవరాజ్​, కర్ణాటక హోంమంత్రి

యావత్​ భారత్​లో ఎన్​ఆర్​సీ చేపట్టితీరతామని, అక్రమ వలసదారులను చట్టపరంగా దేశం నుంచి తరిమికొడతామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్​ షా స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ఎన్​ఆర్​సీ ప్రక్రియపై రెండు చర్చలు జరిగాయని.. కొన్ని రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయని బసవరాజ్​ వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ ప్రక్రియపై వారంలోగా స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు.

అసోంలో మాత్రమే...

ఇప్పటివరకు అసోంలో మాత్రమే ఎన్​ఆర్​సీ పూర్తయింది. జాతీయ పౌర రిజస్ట్రీ​ తుది జాబితాలో 3 కోట్ల 11లక్షల 21 వేల నాలుగు మందికి చోటు లభించింది. సరైన పత్రాలు సమర్పించని కారణంగా 19 లక్షల 6 వేల 657 మందిని జాబితాలో చేర్చలేదు.

ABOUT THE AUTHOR

...view details