దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ పార్టీలతో కలిసి బరిలో దిగనున్నట్టు భాజపా ప్రకటించింది. సంయుక్తంగా పోటీ చేయడం ద్వారా దేశానికి ఓ బలమైన సందేశం అందుతుందని దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ పేర్కొన్నారు.
పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్.. కాషాయ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏలోని జేడీయూ, ఎల్జేపీతో కలిసి పోటీ చేస్తోంది భాజపా.
మొత్తం 70 స్థానాలున్న దిల్లీ శాసనసభలో 67 సీట్లల్లో భాజపా పోటీ చేస్తుండగా... ఎల్జేపీ ఒక స్థానం, జేడీయూ 2 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.