తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అధిష్ఠానంతో మాట్లాడాకే గవర్నర్​తో భేటీ' - భాజాపా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్​షాతో మాట్లాడాకే గవర్నర్​ను కలుస్తామని కర్ణాటక భాజపా అధ్యక్షుడు యడ్యూరప్ప వెల్లడించారు. కన్నడనాట అవినీతి కూటమి శకం ముగిసిందని ప్రకటించారు. నూతన ప్రభుత్వంలో అభివృద్ధి రాజకీయాలు ప్రారంభమౌతాయని ఉద్ఘాటించారు. శాసనసభలో అధికార కూటమి ఓటమితో భాజపా నేతలు సంబరాల్లో మునిగిపోయారు.

'అధిష్ఠానంతో మాట్లాడాకే గవర్నర్​తో భేటీ'

By

Published : Jul 23, 2019, 9:04 PM IST

Updated : Jul 23, 2019, 11:50 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్​ కూటమి బలపరీక్ష ఓటమితో భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. రాష్ట్ర భాజపా కార్యాలయం వద్ద, జిల్లా కేంద్రాల్లో ఊరేగింపుగా సంబరాలు జరుపుకున్నారు. అవినీతి కూటమి శకం ముగిసిందన్నారు భాజపా నేత యడ్యూరప్ప. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్​షాతో చర్చించాకే గవర్నర్​తో భేటీ అవుతానని స్పష్టం చేశారు.

నూతన ప్రభుత్వంలో అభివృద్ధి రాజకీయాలు ప్రారంభమౌతాయని వ్యాఖ్యానించారు.సంకీర్ణ కూటమి ప్రజాస్వామ్య విజయమని ఉద్ఘాటించారు. కుమారస్వామి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కరవు కారణంగా రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, తమ ప్రభుత్వంలో రైతులకు మరింత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.

"అవినీతి శకానికి ముగింపు లభించింది. సమర్థమైన ప్రభుత్వాన్ని అందిస్తామని కర్ణాటక ప్రజలకు హామి ఇస్తున్నాం. మరోసారి కర్ణాటకను సుభిక్షం చేస్తాం."

-ట్విట్టర్​లో కర్ణాటక భాజపా

Last Updated : Jul 23, 2019, 11:50 PM IST

ABOUT THE AUTHOR

...view details