తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అజార్​ అంశంపై భాజపా, కాంగ్రెస్​ మాటల యుద్ధం - సమాజ్​వాదీ పార్టీ

ఐక్యరాజ్యసమితి మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ప్రధాని నరేంద్ర మోదీ ఘనతేనని భాజపా అంటోంది. ఇందులో మోదీ కృషి ఏమీలేదని విపక్షాలు విమర్శించాయి.

అజార్​ అంశంపై భాజపా, కాంగ్రెస్​ మాటల యుద్ధం

By

Published : May 1, 2019, 11:04 PM IST

Updated : May 1, 2019, 11:28 PM IST

అజార్​ అంశంపై భాజపా, కాంగ్రెస్​ మాటల యుద్ధం

జైషే మహమ్మద్​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని భాజపా నేతలు వ్యాఖ్యానించారు. మోదీ చేతిలో దేశం సురక్షితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

"మసూద్​ అజార్​ ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది. భారత్​ ఇప్పుడు సురక్షితంగా, నిలకడగా ఉంది. ఇది ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానానికి ఇది గొప్ప నిదర్శనం." -అరుణ్​జైట్లీ, కేంద్ర ఆర్థికమంత్రి

మసూద్​ అజార్​ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం భారత్​కు దౌత్యపరంగా చరిత్రాత్మక ఘనవిజయం. లోక్​సభ ఎన్నికల వేళ భాజపాకు ఇది కలిసొచ్చే అంశం.

మోదీ ఘనతేమిటి ?

భాజపా నేతల వ్యాఖ్యలను పలువురు విపక్ష నేతలు తిప్పికొట్టారు.

" అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడానికి కారణం పుల్వామా ఉగ్రదాడి మాత్రమే కారణం కాదు. అంతకంటే ముందు అజార్​ అనేక ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డాడు. చైనా అజార్​ను పదేళ్లుగా రక్షిస్తోంది. పుల్వామా ఉగ్రదాడి కంటే ముందు కూడా అతడు ఉగ్రవాదే. " -కాంగ్రెస్​ నేత శశిథరూర్​ ట్వీట్​

"కశ్మీర్​లో ఉగ్రవాదం, పుల్వామా ఉగ్రదాడి కారణంగానే మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించిందనడం నిజమేనా?" - ఒమర్ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ట్వీట్​

సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​ దీనిని భారత ఘన విజయంగా అభివర్ణించారు. వెంటనే మసూద్​ను పాకిస్థాన్ అరెస్టు చేయాలని, అతని ఆస్తులను స్తంభింపజేయాలని, అతని ఉగ్రవాద సంస్థలను మూసివేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: మోదీ, సోనియా, రాహుల్​ల పెట్టుబడులు తెలుసా?

Last Updated : May 1, 2019, 11:28 PM IST

ABOUT THE AUTHOR

...view details