తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మేనిఫెస్టో కాదు.. క్షమాపణ పత్రం ఇవ్వండి' - BJP

భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. 2014 మేనిఫెస్టోనే మరోసారి అచ్చు దింపిందని ఆరోపించింది. కాకపోతే ఈసారి హామీల అమలుకు గడువును మరో ఐదు, పదేళ్లకు పొడిగించిందని దుయ్యబట్టారు కాంగ్రెస్​ సీనియర్ నేత అహ్మద్ పటేల్​.

"మేనిఫెస్టో కాదు.. క్షమాపణ పత్రం ఇవ్వండి"

By

Published : Apr 8, 2019, 5:23 PM IST

భాజపా ఎన్నికల మేనిఫెస్టో 'సంకల్ప పత్రం'పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ సీనియర్ నేత అహ్మద్ పటేల్. గత ఎన్నికల మేనిఫెస్టోనే కాపీ పేస్ట్ చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. హామీలు ఎప్పటికి అమలుకు నోచుకుంటాయనే విషయంపై భాజపా స్పష్టత ఇవ్వలేదన్నారు. బహుశా అమలయ్యేందుకు మరో పది పదిహేనేళ్లు కావాలేమో అని వ్యంగాస్త్రాలు సంధించారు అహ్మద్ పటేల్.

ప్రధాని నరేంద్ర మోదీ అహంకార ధోరణికి భాజపా మేనిఫెస్టోపై పొందుపరిచిన ఆయన ఫోటోనే నిదర్శనమని పటేల్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజల ఫోటోను చూపామని గుర్తు చేశారు.

మేనిఫెస్టో విడుదల కార్యక్రమం అనంతరం మీడియా సమావేశం నిర్వహించకపోవడాన్ని తప్పుబట్టారు పటేల్​. ఐదేళ్ల పాలనపై సమాధానాలు ఇవ్వలేరా అని ప్రశ్నించారు.

మీడియాతో మాట్లాడుతున్న అహ్మద్​ పటేల్​

" ఈ మేనిఫెస్టోను ప్రకటించడానికి బదులు క్షమాపణ పత్రం విడుదల చేసుంటే బాగుండేది. ఐదేళ్లుగా జరిగిందేమీ లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.. ఏమైంది?రైతులకిచ్చిన హమీలు నేరవేర్చలేదు. వ్యాపారులకిచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి. మళ్లీ అవే హామీలతో ముందుకొచ్చారు. ఈసారి రైతులకు రూ.లక్ష వరకూ వడ్డీలేని రుణాలిస్తామంటున్నారు. ఉద్యోగ కల్పన ప్రస్తావనే లేదు. ప్రజలకు మీ గురించి పూర్తిగా అర్థమైపోయింది. "
-అహ్మద్ పటేల్​, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇదీ చూడండి: 'రామ మందిర నిర్మాణం- సంక్షేమ భారతం'

ABOUT THE AUTHOR

...view details