తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా, రాహుల్​ మౌనం వీడాలి: నడ్డా - Rajiv gandhi foundation

చైనాతో ఉన్న సంబంధాలపై అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్​ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా కమ్యూనిస్ట్​ పార్టీతో కాంగ్రెస్​ ఒప్పందంపై సోనియా, రాహుల్​ గాంధీలు మౌనం వీడాలని డిమాండ్​ చేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

BJP, Cong question each other over their alleged China links
సోనియా, రాహుల్​ మౌనం వీడాలి: నడ్డా

By

Published : Aug 7, 2020, 8:36 PM IST

కాంగ్రెస్‌కు, చైనా కమ్యూనిస్టు పార్టీకి మధ్య జరిగిన ఒప్పందం గురించి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ వివరించాలని భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు. దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌ను ప్రస్తావిస్తూ.. ''కాంగ్రెస్‌ పార్టీకి, చైనా ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం గురించి సుప్రీం కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని'' గుర్తు చేశారు నడ్డా.

" ఈ అంశంపై సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్​ గాంధీ స్పందించాలి. అలా అయినా చైనా నుంచి రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌(ఆర్‌జీఎఫ్)కు నిధులు ఎలా వచ్చాయో, ప్రతిగా మీరు చైనా సంస్థలను భారత మార్కెట్లోకి అనుమతించిడం, వారు భారత్‌లోని వ్యాపారాలకు నష్టం చేకూర్చిన విషయాలు బయటపడతాయి."

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

కాంగ్రెస్‌, చైనా మధ్య జరిగిన ఒప్పందం గురించి జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా ఒక రాజకీయ పార్టీ చైనాతో ఎలా ఒప్పందం చేసుకుంటుందని, అటువంటి చట్టం గురించి తాము వినలేదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎస్‌ బోబ్డే వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే ముందు పిటిషనర్‌ హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు.

తూర్పు లద్ధాఖ్‌లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలను పరిష్కరించడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. ఈ విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్‌ పార్టీ, చైనా ప్రభుత్వం మధ్య 2008లో ఒప్పందం జరిగిందని, దాని వల్లనే రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు చైనా నుంచి భారీగా నిధులు అందాయని భాజపా ఆరోపించింది.

ఇదీ చూడండి: 'భయం, అభద్రతా భావంతో దేశ ప్రజలు'

ABOUT THE AUTHOR

...view details