బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 'పరివర్తన యాత్ర' పేరుతో రథ యాత్రను చేపట్టింది భాజాపా. అయితే ముర్షీదాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన కమలనాథుల రథాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలున్నందున జిల్లాలోని బెల్దంగాలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో మరో దారి లేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని రథ యాత్రను ముందుకు సాగించారు భాజపా నాయకులు.
పోలీసులపై మండిపాటు..
బెల్దంగాలో రథయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై జిల్లా భాజపా నాయకులు గౌరీశంకర్ ఘోష్ మండిపడ్డారు. యాత్ర కోసం అనుమతి కోరినప్పుడే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తామని రూట్మ్యాప్లో పొందుపరిచామని చెప్పారు. అప్పుడు ఎలాంటి అభ్యతరం చెప్పకుండా.. ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.