తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్వార్థ రాజకీయాలతో ప్రజాస్వామ్యం ఖూనీ' - karnataka

కర్ణాటకలో భాజపా తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వాన్ని కూల్చేయటంపై దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమయింది హస్తం పార్టీ. దేశ చరిత్రలో అత్యంత హేయమైన కొనుగోలు రాజకీయం ఇదేనని మండిపడింది.

కర్ణాటక

By

Published : Jul 24, 2019, 5:48 AM IST

భాజపా తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం

రాష్ట్రంలో మూడు వారాలుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. సీఎం హెచ్​డీ కుమారస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం విధాన సభలో వీగిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా 99, వ్యతిరేకంగా 105 రావటం వల్ల 14 నెలల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.

ప్రజాస్వామ్యం ఓడింది: రాహుల్​

ప్రలోభ రాజకీయాల ముందు ప్రజాస్వామ్యం, నిజాయతీ, కన్నడ ప్రజలు ఓడిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

రాహుల్ ట్వీట్

"మొదటి రోజు నుంచి కాంగ్రెస్-జేడీఎస్​ కూటమి ప్రభుత్వం.. స్వార్థ ప్రయోజనాలకు లక్ష్యంగా మారింది. బయట, లోపల సంకీర్ణ ప్రభుత్వానికి ఆటుపోట్లు ఎదురవుతూనే వచ్చాయి. స్వార్థమే గెలిచింది. కర్ణాటక ప్రజలు, నిజాయతీ, ప్రజాస్వామ్యం ఓడిపోయాయి."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు

ఈ పరిస్థితికి భాజపా అక్రమ రాజకీయాలే కారణమని కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ వేణుగోపాల్​ ధ్వజమెత్తారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

వేణుగోపాల్​ ట్వీట్స్​

"సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు హీనమైన కుయుక్తులను పన్నింది భాజపా. ఇప్పటి వరకూ ఇలాంటి కొనుగోలు రాజకీయాలను దేశ ప్రజలు ఎక్కడా చూసి ఉండరు. కేంద్ర ప్రభుత్వం, గవర్నర్​, మహారాష్ట్ర ప్రభుత్వం, భాజపా అధినాయకత్వం సమష్టిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయి.

ఎమ్మెల్యేలకు డబ్బు, మంత్రి పదవులు ఆశజూపి రాజకీయ నాటకానికి భాజపా తెరలేపింది. ఈడీ, ఐటీ శాఖలతో భాజపా బెదిరింపులకు పాల్పడింది. భాజపా అక్రమ రాజకీయాలకు వ్యతిరేకంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతాం."

-కేసీ వేణుగోపాల్, కర్ణాటక కాంగ్రెస్ ఇన్​ఛార్జి

ఇదీ చూడండి: 'అక్రమ మార్గంలో అధికారంలోకి భాజపా'

ABOUT THE AUTHOR

...view details