'మహా' మలుపు: సర్కారు ఏర్పాటుకు భాజపా నో - maharashtra govt

18:23 November 10
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం: భాజపా
మహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక మలుపు. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని భాజపా స్పష్టం చేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీకి వివరించింది. సరిపడా సంఖ్యా బలం లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌కు తెలిపింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. పార్టీ నేతలతో కలిసి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీతో రాజ్ భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ప్రకటించారు. శివసేన తమకు మద్దతివ్వడం లేదన్నారు. ప్రజల తీర్పును శివసేన అవమానపరిచిందని విమర్శించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని శివసేన భావిస్తే.. ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు పాటిల్.