తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియాపై బరిలో కాంగ్రెస్​ మాజీ నేత! - భాజపా

ఉత్తరప్రదేశ్​లో దిగ్గజ నేతలు సోనియా గాంధీ, అఖిలేష్​ యాదవ్​, ములాయం పోటీ చేస్తున్న ముఖ్యమైన మూడు స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. సోనియాపై కాంగ్రెస్​ మాజీ నేతను పోటీకి దింపింది భాజపా.

సోనియాపై బరిలో కాంగ్రెస్​ మాజీ నేత!

By

Published : Apr 4, 2019, 8:45 AM IST

Updated : Apr 4, 2019, 9:00 AM IST

సోనియాపై బరిలో కాంగ్రెస్​ మాజీ నేత!
ఉత్తరప్రదేశ్​లోని మూడు కీలక లోక్​సభ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులను ప్రకటించింది. యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీకి పోటీగా రాయ్​బరేలీ నుంచి దినేష్​ ప్రతాప్​ సింగ్​ బరిలో దిగుతారు. 2004 నుంచి రాయ్​బరేలీలో తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్నారు సోనియా. రెండు సార్లు కాంగ్రెస్​ తరపున శాసన మండలి నుంచి గెలుపొందిన దినేష్​ ప్రతాప్​ 2018లో​ పార్టీని వీడి భాజపాలో చేరారు.

ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​ పోటీ చేస్తున్న ఆజామ్​గఢ్​లో భాజపా అధిష్ఠానం దినేష్​ లాల్​ యాదవ్​ను​ బరిలో దింపింది. మెయిన్​పురిలో ములాయంసింగ్​తో ప్రేమ్​ సింగ్​ శౌక్య అమీతుమీ తేల్చుకోనున్నారు.

వీటితో పాటు మచ్లిషహర్​(ఎస్సీ), ఫిరోజాబాద్​ స్థానాలకూ భాజపా తన అభ్యర్థులను ప్రకటించింది.

ఇదీ చూడండి:'నన్ను బెదిరించారు'... జయప్రద కంటతడి

Last Updated : Apr 4, 2019, 9:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details