భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వ్యక్తుల పార్టీ కాదని, అది సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పార్టీ మొత్తం మోదీ చుట్టూనే తిరుగుతోందన్న ఆరోపణలను ఖండించారు. ఈసారి కేంద్రంలో ఎవరికీ ఆధిక్యం రాదన్న వాదనను కొట్టిపారేశారు. గత ఎన్నికల కంటే ఎక్కువ స్థాయిలో భాజపాకు స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భాజపా గతంలోనూ అటల్ లేదా అడ్వాణీల పార్టీగా లేదని, ఇప్పుడూ అది మోదీ-షాల పార్టీ కానే కాదని చెప్పారు.
భాజపా 'మోదీ-షా'ల పార్టీ కాదు : గడ్కరీ - gadkari
సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోమారు కేంద్రంలో అధికారాన్ని చేపడతామని ధీమా వ్యక్తం చేశారు భాజపా నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. భాజపా 'మోదీ-షా'ల పార్టీ కాదని.. సిద్ధాంతాల పార్టీ అని వ్యాఖ్యానించారు.
![భాజపా 'మోదీ-షా'ల పార్టీ కాదు : గడ్కరీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3247347-797-3247347-1557539980835.jpg)
భాజపా 'మోదీ-షా'ల పార్టీ కాదు : గడ్కరీ
పార్టీ బలంగా ఉండి నాయకుడు బలహీనంగా ఉన్నా, నాయకుడు బలంగా ఉండి పార్టీ బలహీనంగా ఉన్నా గెలవడం అసాధ్యమన్నారు గడ్కరీ. ప్రాచుర్యం ఉన్న నాయకులు సహజంగానే ముందుకొస్తారని చెప్పారు. భాజపా అభివృద్ధి అజెండాను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షం కులమతాల పేరుతో విషం చిమ్మే ప్రయత్నం చేసిందని, ప్రజలు తమతోనే ఉన్నందువల్ల పూర్తి ఆధిక్యంతో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయ భద్రతను ఎన్నికల అంశంగా చేయలేదని స్పష్టం చేశారు గడ్కరీ.
ఇదీ చూడండి : దిల్లీ మహిళా కమిషన్‌లో గంభీర్‌పై ఫిర్యాదు
Last Updated : May 11, 2019, 9:54 AM IST