తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఎన్నికల్లో భాజపా- అన్నాడీఎంకే కూటమిదే విజయం'

తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ప్రకటన చేశారు. భాజపా-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

amit shah palaniswami
తమిళనాడు

By

Published : Nov 21, 2020, 8:56 PM IST

వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. భాజపా-అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోమంత్రి అమిత్​ షా చెన్నైలో పర్యటిస్తున్నారు. లీలా ప్యాలెస్​లో నిర్వహించిన కార్యక్రమంలో అమిత్​ షా పాల్గొనగా.. ఆయన సమక్షంలో పొత్తుపై ప్రకటన చేశారు పళనిస్వామి.

కార్యక్రమంలో భాగంగా చెన్నై మెట్రో రెండో దశ పనులకు అమిత్​ షా దృశ్యమాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. తిరువళ్లూరు జిల్లాలో రూ.380 కోట్లతో నిర్మించిన రిజర్వాయర్​ను ప్రారంభించారు. మొత్తం రూ. 67వేల కోట్లు విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

"మిత్రులారా.. ఈ రోజు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో కలిసి శంకుస్థాపన చేశాం. రూ. 70 వేల కోట్లు విలువైన వివిధ రకాల ప్రాజెక్టులకు భూమిపూజ చేశాం. తమిళనాడును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. మహానేత ఎంజీఆర్, జయలలిత నేతృత్వంలో తమిళనాడు ఏ విధంగా అభివృద్ధి చెందిందో.. పళనిస్వామి నేతృత్వంలో కూడా అదే విధంగా పురోగమిస్తుందని భరోసా ఇస్తున్నాను."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఇదీ చూడండి:చెన్నై మెట్రో 2.0 పనులకు అమిత్ షా శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details