మహారాష్ట్ర బుల్డానాలో ఓ విచిత్ర ఘటన వెలుగు చూసింది. చిన్నారి మృతదేహం అనుకుని, ఓ బొమ్మను స్టేషన్కు పట్టుకొచ్చారు పోలీసులు. తీరా పోస్టుమార్టం చేశాక అసలు సంగతి తెలిసింది.
బుల్డానా జిల్లా ఖామ్గావ్ తాలూకా బోర్జావాల్ గ్రామంలో గురువారం ఓ 'చిన్నారి' మృతదేహం నదిలో తేలుతూ కనిపించింది. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు.