కరోనా విజృంభిస్తున్న వేళ భోజన ప్రియులు 'బిర్యానీ'పై అమితంగా ఆసక్తి చూపారు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అధిక శాతం ఆర్డర్ చేసిన వాటిలో బిర్యానీకి మొదటి స్థానం దక్కింది.
లాక్డౌన్లోనూ బిర్యానీని తెగ తినేశారు! - లాక్డౌన్ స్విగ్గీ
లాక్డౌన్లోనూ బిర్యానీని వదల్లేదు భోజన ప్రియులు. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అధిక శాతం ఆర్డర్ ఇచ్చిన వాటిలో బిర్యానీ మొదటి స్థానంలో ఉందని స్విగ్గీ నివేదికలో తేలింది.
లాక్డౌన్లోనూ బిర్యానీని తెగ తినేశారు!
స్విగ్గీ నివేదిక ప్రకారం బిర్యానీ కోసం దాదాపు 5.5 లక్షల ఆర్డర్లు వచ్చాయి. ఆ తరువాత 3.35 లక్షల ఆర్డర్లతో బటర్ నాన్ రోటీ, 3.31 లక్షలతో మసాలా దోశ.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వరుసగా నాలుగో ఏడాది అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాలలో బిర్యానీ మొదటి స్థానాన్ని నిలుపుకొంది.
ఇదీ చూడండి:-చికెన్ బిర్యానీ పెట్టలేదని కరోనా రోగికి కోపమొచ్చింది!