తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వందేళ్లు దాటిన దంపతులకు జోర్దార్​గా బర్త్​డే పార్టీ - వందేళ్లు దాటిన దంపతులకు జోర్దార్​గా బర్త్​డే పార్టీ

పుట్టినరోజు వేడుకలు అనగానే మన మనసుల్లో చిన్న పిల్లలు మెదులుతారు. కానీ కర్ణాటకలోని మండ్యలో ఓ జంట కోసం నిర్వహించిన జన్మదిన వేడుక అందరినీ ఆశ్చర్యపరిచింది. కారణమేమిటో తెలుసా!

వందేళ్లు దాటిన దంపతులకు జోర్దార్​గా బర్త్​డే పార్టీ

By

Published : Oct 23, 2019, 4:25 PM IST

Updated : Oct 23, 2019, 6:18 PM IST

వందేళ్లు దాటిన దంపతులకు జోర్దార్​గా బర్త్​డే పార్టీ

ఎవరిదైనా జన్మదినమైతే నిండు నూరేళ్లు వర్ధిల్లూ.. అని దీవిస్తారు. ఒకవేళ ఆ ఆశీర్వచనాలు ఫలించి వందేళ్ల జీవితం జీవిస్తేనే ప్రస్తుత కాలంలో అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ శతాధిక జంటకు పుట్టినరోజు పండుగ జరిపించింది ఆ కుటుంబం.

కర్ణాటకలోని మండ్య జిల్లా మద్దూరు ప్రాంతం కొట్టనహళ్లికి చెందిన మంచెగౌడ వయసు 113 ఏళ్లు. ఆయన సతీమణి నిగమ్మకు 99 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా దంపతులిద్దరి జన్మదిన వేడుక జరిపించారు కుటుంబ సభ్యులు. 150 మంది పుత్ర, పౌత్రులు హ్యాపి బర్త్​డే అని పాటలు పాడుతుండగా కేక్ కట్ చేసింది ఈ జంట.

1938లో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంటకు ఏడుగురు సంతానం. ఆరుగురు కుమార్తెలు.. ఓ కుమారుడు. 20 ఏళ్ల కిందట మంచెగౌడ చూపు కోల్పోయారు.

ఇదీ చూడండి:హాంగ్​కాంగ్​లో ప్రజా విజయం... 'చైనా బిల్లు' ఉపసంహరణ

Last Updated : Oct 23, 2019, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details