తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరదల్లో చిక్కుకున్న మోదీ- కాపాడిన ఎన్​డీఆర్​ఎఫ్​ - మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులను ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం రక్షించింది.

బిహార్​ ఉపముఖ్యమంత్రికీ వరద ముప్పు తప్పలేదు. భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న పట్నాలోని సుశీల్​ మోదీ నివాసం జలదిగ్భందంలో చిక్కుకుంది. మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులను ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం రక్షించింది.

వరదల్లో చిక్కుకున్న మోదీ- కాపాడిన ఎన్​డీఆర్​ఎఫ్​

By

Published : Sep 30, 2019, 12:25 PM IST

Updated : Oct 2, 2019, 1:58 PM IST

వరదల్లో చిక్కుకున్న మోదీ- కాపాడిన ఎన్​డీఆర్​ఎఫ్​

వరదల ధాటికి బిహార్​ గజగజలాడుతోంది. వరుసగా నాలుగో రోజు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

బిహార్​ ఉపముఖ్యమంత్రి కూడా వరద ముప్పు నుంచి తప్పించుకోలేకపోయారు. పట్నా రాజేంద్ర నగర్​లోని సుశీల్ కుమార్​ మోదీ నివాసం జలదిగ్భందంలో చిక్కుకుంది. అక్కడికి చేరుకున్న ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం.. సుశీల్​ మోదీ సహా ఆయన కుటుంబ సభ్యులను రక్షించింది. పడవల సాయంతో వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. తమను రక్షించిన ఎన్​డీఆర్​ఎఫ్​ బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఉపముఖ్యమంత్రి.

ఉపముఖ్యమంత్రి పరిస్థితే ఇలా ఉండటం వల్ల సామాన్యులు మరింత భయపడిపోతున్నారు. బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
బిహార్​లో భారీ వర్షాలకు ఇప్పటివరకు 29 మంది మరణించారు.

ఇదీ చూడండి:- ఉత్తరాదిలో వరుణ బీభత్సం- 137 మంది మృతి

Last Updated : Oct 2, 2019, 1:58 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details