తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10 నిమిషాలు ఆలస్యమని 'నీట్'కు నిరాకరణ - బిహార్ నీట్ అభ్యర్థి పది నిమిషాలు ఆలస్యం

నీట్ కేంద్రానికి రావడం 10 నిమిషాలు ఆలస్యమైనందుకు పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థికి అనుమతి నిరాకరించారు అధికారులు. 24 గంటలు కష్టపడి 700 కి.మీలు ప్రయాణించానని విద్యార్థి తన గోడు చెప్పుకున్నాడు.

Bihar teen travels 700 km in 24 hrs, yet misses NEET exam by 10 minutes
10 నిమిషాలు ఆలస్యమని నీట్ పరీక్షకు నిరాకరణ

By

Published : Sep 17, 2020, 12:29 PM IST

పరీక్షా కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో బిహార్​కు చెందిన ఓ విద్యార్థిని 'నీట్'కు హాజరయ్యేందుకు అధికారులు అనుమతించలేదు. కోల్​కతాలో జరిగిన ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

బిహార్​ దర్భంగకు చెందిన సంతోష్ కుమార్ యాదవ్ అనే విద్యార్థి నీట్​కు దరఖాస్తు చేసుకున్నాడు. పరీక్షా కేంద్రం కోల్​కతాలో ఉంది. తన నివాసం నుంచి అక్కడకు 700 కిలోమీటర్ల దూరం. 24 గంటలు ప్రయాణించి కోల్​కతా చేరుకున్నాడు.

"దర్భంగలో శనివారం ఉదయం 8 గంటలకు బస్ ఎక్కాను. ముజఫర్​పుర్, పట్నా మధ్య ట్రాఫిక్ జాం కావడం వల్ల 6 గంటలు వృథా అయింది. పట్నా నుంచి రాత్రి 9 గంటలకు బయల్దేరి ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు కోల్​కతాకు చేరుకున్నా. ట్యాక్సీలో పరీక్షా కేంద్రానికి వెళ్లేసరికి 1.40 గంటలు అయింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు 1.30 గంటల వరకే గడువు ఉందని నన్ను అనుమతించలేదు."

-సంతోష్ కుమార్ యాదవ్, విద్యార్థి

పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు రెండు రోజుల ముందు నుంచే బస్ టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు చెప్పాడు సంతోష్. తనకెంతో కీలకమైన విద్యాసంవత్సరాన్ని కోల్పోయానని బాధ పడుతున్నాడు. వచ్చే ఏడాది కోసం మళ్లీ సన్నద్ధమవుతానని చెబుతున్నాడు.

దీనిపై దృష్టిసారించండి

ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థుల కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని శశ్వాంత్ ఆనంద్ అనే న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారు. ఇలాంటి విద్యార్థుల కోసం మరోసారి పరీక్షను నిర్వహించాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

ఇదీ చదవండి-విద్యార్థుల దగ్గరకే పాఠాలు- బైకు మీద క్లాసులు

ABOUT THE AUTHOR

...view details