కరోనా వైరస్ సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందర్నీ బెంబేలెత్తిస్తోంది. బిహార్‌లో మరో ప్రజాప్రతినిధికి కొవిడ్-19 సోకింది. ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే షహ్నావాజ్ ఆలంకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఆయనతో కలిపి బిహార్‌లో ఇప్పటివరకు ముగ్గురు శాసనసభ్యులు వైరస్ బారిన పడ్డారు.
సదరు ఎమ్మెల్యే అరియారియా జిల్లాలోని జోకిహాట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆలంకు ఎటువంటి వైరస్ లక్షణాలు లేవని.. అయినప్పటికీ పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు వైద్యులు తెలిపారు. పాటిజివ్ అని తేలిన వెంటనే ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు.. ఎమ్మెల్యేతో సంబంధం ఉన్న వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు.