కన్నబిడ్డ కోసం.... విధ్వంసం సృష్టించారు బిహార్ నలందాలోని ఇస్లాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అప్పుడే జన్మించిన శిశువును ఓ గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. తీవ్ర ఆగ్రహం చెందిన పసిబిడ్డ తల్లి బంధువులు ఆసుపత్రిపై రాళ్లు విసిరి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఇదీ జరిగింది..
నిన్న రాత్రి ఓ మహిళ ప్రసవం కోసం ఇస్లాంపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చేరింది. అయితే పుట్టిన బిడ్డను గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని భావించిన బాధితురాలి బంధువులు దాడికి దిగారు.
పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: యువతి గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం