తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ బరి: కాంగ్రెస్ రెండో జాబితాలో వారికి చోటు! - శత్రుఘ్న సిన్హా కుమారుడు

బిహార్​లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తమ అభ్యర్థులకు సంబంధించి 49 మందితో రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​. ఇందులో కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా కుమారుడు, శరద్​ యాదవ్​ల కుమార్తెలకు సీట్లు దక్కాయి. 'మహాగట్​బంధన్​'లోని కాంగ్రెస్​.. మొత్తం 70 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.

Bihar polls: Shatrughan Sinha's son, Sharad Yadav's daughter figure in Cong's 2nd list
బిహార్​ బరి: 'కాంగ్రెస్'​ రెండో జాబితాలో వారికి చోటు

By

Published : Oct 16, 2020, 5:55 AM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీ.. తన రెండో జాబితాను విడుదల చేసింది. 49 మంది పేర్లను ప్రకటించిన ఈ జాబితాలో.. కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా తనయుడు లువ్​ సిన్హా, జేడీయూ నేత శరద్​యాదవ్​ కుమార్తె సుభాషిని యాదవ్​లకు చోటు దక్కింది. బంకిపుర్​ నియోజకవర్గం నుంచి సిన్హా పోటీ చేయనుండగా.. బిహారీగంజ్​ నుంచి సుభాషిని బరిలోకి దిగనున్నారు.

ఇటీవలే లోక్​ జన్​శక్తి పార్టీ(ఎల్​జేపీ)ని వీడిన సుభాషిని.. బుధవారమే కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఈమెతో పాటు అదేరోజు పార్టీలో చేరిన మాజీ ఎంపీ కాళీ పాండే.. కుచాయ్​కోట్​ అసెంబ్లీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

తాజాగా విడుదలైన అభ్యర్థుల జాబితా నవంబర్​ 3, 7 తేదీలలో జరగబోయే రెండు, మూడు దశల ఎన్నికలకు సంబంధించిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్​ 28న జరగనున్న తొలిదశ పోలింగ్​కు 21 మంది అభ్యర్థులతో ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్​.

ఆర్జేడీ నాయకత్వంలోని 'మహాగట్​బంధన్​' లో భాగంగా మొత్తం 70స్థానాల్లో పోటీ పడుతోంది కాంగ్రెస్​.

ఇదీ చదవండి:'జేడీయూను మేం మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details