బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆకర్షణీయమైన హామీలను ప్రకటించారు. రాష్ట్రంలో మహిళా సాధికారత, సంక్షేమంతో పాటు బిహార్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మహిళలను ఆకట్టుకునే హామీలను ప్రకటించారు.
జేడీయూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నితీశ్ కుమార్ మాట్లాడుతూ,. బాలికలు విద్యావంతులు కావాలని ఆకాక్షించారు. బాలికలను ప్రోత్సహించేందుకు ఓ పథకాన్ని అమలు చేస్తామని, ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలకు రూ.25 వేలు.. డిగ్రీ పాసైన వారికి రూ.50 వేలు చొప్పున అందజేస్తామని చెప్పారు.