బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో ఒక్క మైనార్టీ అభ్యర్థి పేరు కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే లౌకికవాద కాంగ్రెస్.. ఆ వర్గాన్ని సీట్ల కేటాయింపులో పట్టించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీపై.. మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ విశ్వసనీయత కోల్పోయింది. ఇక్కడ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది. అదే సమయంలో జేడీయూ, ఆర్జేడీ పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్ లేకుండానే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మైనార్టీల్లో నమ్మకం కోల్పోతోంది.
-షామిమ్ హసన్, పట్నా వాసి
కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను బానిసల్లాగా చూస్తోంది. పార్టీ చెప్పినట్లుగా వారు ఆడతారని భావిస్తోంది. ప్రస్తుతం మైనార్టీలను వారెలా చిన్నచూపు చూస్తున్నారో కనిపిస్తోంది. ఇప్పుడు ఓటర్లు తెలివిగా అడుగులు వేస్తారు.
-మహ్మద్, పట్నా వాసి
గతంలో కాంగ్రెస్‌వైపే..
ఎన్నో ఏళ్లుగా బిహార్‌లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా మైనార్టీలు కాంగ్రెస్‌కే మద్దతుగా ఉన్నారు. బిహార్‌లో లాలూ ఎంట్రీ తర్వాత.. ముస్లిం ఓటర్లు ఆయనవైపు మళ్లారు. అనంతరం లాలూ ఆర్జేడీ-కాంగ్రెస్ కలిసి పోటీలో దిగుతున్న నేపథ్యంలో గంపగుత్తగా మైనార్టీల ఓట్లు ఈ కూటమికే పడేవి. సీట్ల కేటాయింపుల్లోనూ పార్టీలు ఈ వర్గానికి పెద్దపీట వేసేవి. అయితే, 2020 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ జాబితా అందుకు భిన్నంగా ఉంది.
తాజా ఎన్నికల్లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్న ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. వామపక్షాలకు 29 సీట్లు కేటాయించారు.
ఇదీ చూడండి: బిహార్ బరి: ఆర్జేడీ-144, కాంగ్రెస్-70 స్థానాల్లో పోటీ
ప్రాధాన్యం ఉంటుంది..