బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేర చరిత్ర ప్రచార అస్త్రంగా మారిన వేళ.. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్)ప్రకటన చర్చనీయాంశంగా మారింది.రెండోదఫా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో మూడోవంతు మందికి నేర చరిత్ర ఉందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) తెలిపింది. ఈ జాబితాలో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అత్యధిక సంఖ్యలో అభ్యర్థులను నిలబెట్టిందని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది.
34 శాతం మంది..
బిహార్ శాసనసభ రెండోదశ ఎన్నికల్లో... అన్ని పార్టీల నుంచి 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 34 శాతం మంది అంటే 502 మందిపై నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. ఈ జాబితాలో అత్యధికంగా ఆర్జేడీ తరుఫున పోటీ చేస్తున్న 56 మందిలో 36మందిపై కేసులు ఉండగా.. భాజపాలో 29, లోక్‌జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) లో 28, బీఎస్పీలో 16, జేడీ(యూ)లో 20, కాంగ్రెస్‌లో 14మందికి క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడైంది. వీరిలో 27శాతం మందిపై అత్యాచారం, హత్య, దాడులు, అపహరణ వంటి తీవ్ర నేరారోపణ కేసులు ఉన్నాయని పేర్కొంది ఏడీఆర్.
బిహర్ అసెంబ్లీ ఎన్నికల్లో 64శాతం మందిని క్రిమినల్స్‌గా ప్రకటించిన వారిలో 47శాతం మందికి ప్రధాన పార్టీలు టిక్కెట్ ఇచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది.