కొద్దిరోజులుగా బిహార్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం పట్నాలో మరోసారి లాక్డౌన్ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది జిల్లా యంత్రాంగం. జులై 10 నుంచి 16 వరకు నగరం లాక్డౌన్లో ఉంటుందని ప్రకటించింది.
రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 749 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజు కేసుల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం. బిహార్లో మొత్తం 13 వేల 274 మంది కరోనా బారినపడ్డారు.