తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెనక్కి తగ్గిన నేపాల్.. క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

బిహార్​లోని పంతోక గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంప్​ సహా వాచ్​ టవర్​ను నేపాల్ తొలగించింది. భారత భూభాగంలోకి చొరబడిన నేపాలీ దళాలను ఉపసంహరించుకుంది. భారత సైన్యంతో జరిపిన చర్చల ఫలితంగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Bihar: Nepal removes temporary camp, watch tower after military talks
వెనక్కి తగ్గిన నేపాల్: క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

By

Published : Jun 27, 2020, 5:40 PM IST

వరుసగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. సరిహద్దుకు సమీపంలో మిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసిన నేపాల్ తాజాగా వెనక్కి తగ్గింది. బిహార్​లోని పంతోక గ్రామంలో నిర్మించిన క్యాంప్ సహా వాచ్​ టవర్​ను తొలగించింది. నేపాల్ సైన్యంతో సశస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ) జరిపిన చర్చల ఫలితంగా పొరుగుదేశం ఈ మేరకు చర్యలు తీసుకుంది.

అంతకుముందు భారత భూభాగంలోకి చొరబడిన నేపాలీ దళాలు సైతం... సైనిక, దౌత్యపరమైన చర్యల తర్వాత వెనక్కి తగ్గాయి. సరిహద్దు వెంబడి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా బలగాలను ఉపసంహరించుకుంది నేపాల్.

వెనక్కి తగ్గిన నేపాల్: క్యాంప్, వాచ్​ టవర్ తొలగింపు

వాచ్​ టవర్ వివాదం

సరిసవా నదికి అవతల భారత భూభాగంలో వాచ్​ టవర్ నిర్మించడం ఇరుదేశాల మధ్య వివాదానికి దారితీసింది. చైనా ఆదేశాలతోనే సరిహద్దులో పర్యవేక్షణ పెంచడానికి ఈ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది.

సరివాసా నదికి దగ్గర్లోని భారత్​కు చెందిన భూభాగంపై నేపాల్ తమదని వాదిస్తోందని అధికారులు పేర్కొన్నారు. నేపాల్​లో ప్రవహించే నది చివరకు సుగౌలి వద్ద బుధి గండక్ నదిలో కలుస్తుందని తెలిపారు. మరోవైపు... స్వీయ రక్షణ పెంపొందించుకోవడానికి పిథౌర్​గఢ్​​లోని దర్చులా నుంచి కాలాపానీ వరకు నేపాల్ అదనపు బలగాలను మోహరిస్తోందని అధికారులు తెలిపారు.

దుస్సాహసాలు

భారత్​లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను నేపాల్​లో అంతర్భాగంగా పేర్కొంటూ ఆ దేశం చేసిన వాదనతో ఇరుపక్షాల మధ్య వివాదం మొదలైంది. ఈ ప్రాంతాలను తమ భూభాగంలో చూపుతూ రాజకీయ మ్యాప్​ రూపొందించింది. దీంతో పాటు సరిహద్దులో అనవసర ఉద్రిక్తతలు రాజేస్తోంది. బిహార్ ప్రభుత్వం చేపట్టిన వరద నియంత్రణ కార్యక్రమాలకు అడ్డుతగులుతోంది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details