గ్రామస్థుల కోసం 30 ఏళ్లపాటు కష్టపడి కాలువను ఒక్కడే తవ్వి వార్తల్లో నిలిచిన 'కెనాల్ మ్యాన్' లాంగీ భుయాన్ కృషిని దిగ్గజ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూఫ్ అధినేత ఆనంద్ మహీంద్ర గుర్తించారు. లాంగీ నిబద్ధతకు మెచ్చి చిరు కానుక అందించారు. మహీంద్ర సంస్థ నుంచి ఉచితంగా ట్రాక్టర్ను అందజేశారు.
లాంగీకి ట్రాక్టర్ కీ అందిస్తున్న షోరూం ప్రతినిధులు లాంగీకి పుష్పగుచ్చంతో అభినందనలు లాంగీకి అందించిన ట్రాక్టర్ ఇదే "లాంగీ భుయాన్ గురించి ట్విట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్ర తెలుసుకున్నారు. ఆయనకు ట్రాక్టర్ ఇవ్వడం అదృష్టంగా భావించారు. అనంతరం, లాంగీకి ట్రాక్టర్ అందించాలని తమ కార్యాలయానికి ఈ-మెయిల్ వచ్చింది."
-సిద్ధినాథ్ విశ్వకర్మ, మహీంద్ర షోరూం డీలర్
మావోయిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే గయా జిల్లాలోని కొథిల్వా గ్రామంలో లాంగీ నివసిస్తున్నాడు. కొండ ప్రాంతంలో వృథాగా పోతున్న వర్షం నీటిని తన గ్రామానికి మళ్లించాలనే ఆలోచనతో ఒక్కడే 30 ఏళ్లపాటు కష్టడ్డాడు. గ్రామంలోని చెరువు వరకు 3 కిలోమీటర్ల మేర కాలువ తవ్వాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వ్యవసాయ సాగుకు, పశుపోషణకు ఆ నీరు ఉపయోగపడుతుంది. ఫలితంగా 'కెనాల్ మ్యాన్' అని అతనిపై స్థానికులే కాకుండా నెటిజన్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు.