లైంగిక కోరిక తీర్చలేదని తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడో మూర్ఖుడు. మహిళ మీద కోపంతో మూడునెలల కూతురుని మంటల్లో పడేశాడు. ఈ అమానుష ఘటన బిహార్లోని ముజఫర్పుర్లోని బోచహన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కోపంతో మంటల్లోకి..
ఇంటి బయట చలిమంట కాగుతున్న మహిళ పక్కన కూర్చున్న ఒక వ్యక్తి.. లైంగిక కోరిక తీర్చాల్సిందిగా వేధించాడు. సదరు మహిళ ప్రతిఘటించగా.. ఆమె ఒడిలో ఉన్న మూడు నెలల శిశువును మంటల్లోకి విసిరేశాడు. మంటల్లో చిక్కుకున్న శిశువు కాళ్లు పాక్షికంగా కాలిపోయాయని.. ఇతర చోట్ల గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు డీఎస్పీ వైద్యనాథ్ సింగ్ తెలిపారు.