తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య! - బిహార్

బిహార్​లో ట్రాఫిక్​ నిబంధనలు అతిక్రమించినందుకు ఓ ద్విచక్రవాహనదారుడికి జరిమానా విధించారు ట్రాఫిక్​ పోలీసులు. ఆ వ్యక్తి మాత్రం తాను జరిమానా కట్టనంటూ రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఒంటిపై ప్రెటోల్​ పోసుకొని అందరినీ హడలెత్తించాడు.

ట్రాఫిక్​ చలానా రాశారని రోడ్డుపై ఆత్మహత్య!

By

Published : Oct 12, 2019, 2:24 PM IST

Updated : Oct 12, 2019, 4:20 PM IST

ట్రాఫిక్​ పోలీసులు జరిమానా విధించారని నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం చేశాడో ద్విచక్రవాహనదారుడు. ఈ ఘటన బిహార్​లోని పూర్ణియాలో జరిగింది.

ఇదీ జరిగింది

పూర్ణియా ఆర్​ఎన్​ఎస్​ఏవీ చౌక్​ వద్ద ట్రాఫిక్​ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్​ లేకుండా బైక్​పై వెళ్తున్న సత్యం సిన్హాను ఆపి, రూ.2,000 జరిమానా వేశారు. అందుకు ప్రతిగా సత్యం చేసిన పని... అందరినీ నివ్వెరపరిచింది.

"బైక్​ చోదకుడు హెల్మెట్​ ధరించకుండా బండి నడిపాడు. అందుకని నూతన చట్ట ప్రకారం అతనికి జరిమానా విధించాను. అందుకు నిరాకరించిన అతను శరీరంపై ప్రెటోల్​ పోసుకొన్నాడు. అగ్గిపుల్ల వెలిగించి చచ్చిపోతానంటూ రోడ్డుపై వీరంగం సృష్టించాడు. తక్షణమే అతడిని అడ్డుకొని పోలీసులకు అప్పగించాను."
-రాజేశ్​ కుమార్​, ట్రాఫిక్​ పోలీసు ఇన్​స్పెక్టర్​

సత్యం వాదన మరోలా ఉంది. తనను పోలీసులు కావాలనే వేధిస్తున్నారని ఆరోపించాడు.

"నేను హెల్మెట్​ ధరించటం మర్చిపోయాను. అందుకు ట్రాఫిక్​ పోలీసులు రూ.2000 జరిమానా విధించారు. నేను అంత కట్టలేనని, తొందరపాటులో హెల్మెట్​ ధరించటం మర్చిపోయానని ప్రాధేయపడ్డాను. అయినా పోలీసులు నాకు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు. అందుకని నేను బలవన్మరణానికి యత్నించాను."
-సత్యం సిన్హా, బైక్​ చోదకుడు

ఇదీ చూడండి : అంతర్జాతీయ సమస్యలపై మోదీ, జిన్​పింగ్​ చర్చ

Last Updated : Oct 12, 2019, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details