తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2020, 12:58 PM IST

ETV Bharat / bharat

దొంగతనం చేసిన బాలుడికి జడ్జి సాయం

బిహార్​లో ఓ బాలుడు దొంగతనం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. కోర్టులో దోషి అని తేలిపోయింది. ఇక ఆ బాలుడు కటకటాలు లెక్క పెట్టాల్సిందే అని అంతా అనుకున్నారు. కానీ, జడ్జి తీర్పు విని విస్తుపోయారు. శిక్ష విధించాల్సిన జడ్జి... నిందితుడికి బట్టలు, సరకులు కొనిచ్చి ఇంటికి పంపారు. ఇంతకీ ఆయన అలా ఎందుకు చేశారు?

Bihar: Judge provides ration, clothes for minor who committed theft for starving mother in nalanda
దొంగతనం చేసిన బాలుడికి సాయం చేసిన జడ్జి!

చట్టానికి కళ్లు ఉండవేమో.. కానీ, న్యాయమూర్తులకు మనసు ఉంటుంది. అందుకే, తల్లి ఆకలి తీర్చేందుకు దొంగగా మారిన ఓ బాలుడిని శిక్షించకుండా సాయం చేశారు బిహార్​కు చెందిన ఓ జడ్జి.

​నలందలో దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు ఓ మైనర్​. అతడిని అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపరిచారు. జడ్జి ముందు తప్పు ఒప్పుకున్నాడు బాలుడు. ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకున్నాడు.

"నేను దొంగతనం చేసి పారిపోతున్నప్పుడు నన్ను పోలీసులు పట్టుకున్నారు. స్థానికులు గుమిగూడి నన్ను బాగా కొట్టారు. ఆ తర్వాత నన్ను జైలుకు తీసుకెళ్లారు. కోర్టులో నన్ను హాజరుపరిచినప్పుడు జడ్జి నా బాధ అర్థం చేసుకున్నారు. నేను ఎందుకు దొంగతనానికి తెగబడ్డానో తెలుసుకున్నారు. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. మాకు తినడానికి తిండి లేదు. ఆమె ఆకలి తీర్చేందుకే నేను ఈ పని చేశాను. "

-బాధిత బాలుడు

బాలుడి దీన పరిస్థితి చూసి చలించిపోయారు స్థానిక కోర్టు జడ్జి. అందుకే శిక్షించకుండా కరుణించారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్​​ తప్ప... ఉండేందుకు ఇల్లు కూడా లేని ఆ కుటుంబానికి రేషన్​, బట్టలు అందించి ఆదుకున్నారు. గత్యంతరం లేక తప్పు చేసిన కొడుకును జైలుకు పంపకుండా ఆ తల్లి ముఖాన చిరునవ్వులు కురిపించారు.

కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు ఆ బాలుడు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందన్నారు.

ఇదీ చదవండి:ఈ ప్రాంతాల్లో కరోనా తీవ్రత అధికం: హోంశాఖ

ABOUT THE AUTHOR

...view details