తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వరద కష్టాలు.. ఇళ్ల పైకప్పులే నివాసాలు

బిహార్​ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల కారణంగా పశ్చిమ చంపారన్​ జిల్లా మంగళ్​పుర్ కాలా​ గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఆ ప్రాంత వాసులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కొంతమంది ఆరు రోజులుగా ఇంటి పైకప్పులనే నివాసాలుగా మార్చుకుని నివసిస్తున్నారు.

Bihar villagers forced to settle on rooftop of their huts as floods wreak havoc

By

Published : Jul 18, 2020, 4:36 PM IST

బిహార్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజుల నుంచి కురుస్తున్న వానల కారణంగా పలు గ్రామాలు నీటమునిగాయి. జన జీవనం స్తంభించింది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

వరద గుప్పిట్లో బిహార్​.. ఇళ్ల పైకప్పుపైనే నివాసం
వరద గుప్పిట్లో బిహార్​.. ఇళ్ల పైకప్పుపైనే నివాసం

పశ్చిమ చంపారన్ జిల్లా మంగళ్​పుర్ కాలా గ్రామం వరదల ధాటికి నీటమునిగింది. పలు ఇళ్లు సగానికి పైగా జలదిగ్బంధమయ్యాయి. దీంతో చాలా మంది ప్రజలు ఇంటిపై కప్పు మీదకు ఎక్కి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఆరు రోజులుగా పైకప్పే నివాసం
ఇంటి పై కప్పుపై నివాసం ఉంటున్న ప్రజలు
నడుము లోతులో వరద నీరు
సగానికి పైగా నీట మునిగిన ఇళ్లు

ఆరు రోజులుగా ఇంటిపైనే ఉంటున్నామని.. అధికారులెవ్వరూ ఇంతవరకు రాలేదని వాపోతున్నారు. భార్య, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారు మాత్రం ఇంట్లోని వస్తువులు వరద నీటిలో కొట్టుకుపోకుండా కాపలా కాస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:'షా'తో ఫడణవిస్‌ భేటీ 'ఆపరేషన్‌ కమలం' కోసమా?

ABOUT THE AUTHOR

...view details