లాలూ ప్రసాద్ యాదవ్... బిహర్ రాజకీయల్లో ఆయనది చెరగని ముద్ర. అయితే ఎన్నో ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ.. లాలూ సొంత గ్రామంలో ఇప్పటికీ విజయం సాధించలేకపోవడం ఆర్జేడీ నేతలను కలవరపెడుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ కలను నెరవేర్చుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు.
ఎన్ని చేసినా...
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టింది పుల్వారియా గ్రామంలో. ఆ ప్రాంతం ప్రస్తుతం హథువా నియోజకవర్గం కింద ఉంది. అయితే లాలూ ఇక్కడ ఎప్పుడూ విజయం సాధించలేదు. ప్రస్తుత ఎన్నికల్లో దీనిపై ఆర్జేడీ కసరత్తులు ప్రారంభించింది. ఆర్జేడీ సుప్రీమో సొంత ప్రాంతంలో గెలుపే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో బరిలో దిగుతోంది.
ఇదీ చూడండి-నితీశ్ నమ్మకద్రోహం చేశారు: లాలూ
మరోవైపు గ్రామ ప్రజల్లో కొంతమంది.. ఈసారి ఆర్జేడీ పట్ల సానుకూలంగా ఉన్నట్టు కనపడుతోంది. రాష్ట్ర చరిత్రనే మార్చేసిన నేతను చూసి వారు గర్వపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు లాలూ చేసిన అభివృద్ధి పనులను గుర్తుతెచ్చుకుంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ పార్టీయే విజయం సాధించాలని ప్రార్థిస్తున్నారు.
"అధికారంలో ఉన్నప్పుడు పుల్వారియాలో లాలూ అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన ఓటమి తర్వాత ఇక్కడ అసలు అభివృద్ధే జరగలేదు. ప్రజలకు సహాయం చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే విఫలమయ్యారు. రోడ్డు, విద్య, ఆరోగ్యం, నిరుద్యోగాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ లాలూ అలా కాదు. అప్పుడప్పుడు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడి ప్రజలను కలిసే వారు. ఈసారి మా ఓటు లాలూ పార్టీకే."