బిహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాజవ్ నామినేషన్ దాఖలు చేశారు. రాఘోపుర్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.
మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ నామినేషన్ - Lalu Prasad Yadav's son files nomination from raghopur
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపుర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న తేజస్వీ యాదవ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు.
మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ నామినేషన్ దాఖలు
అంతకుముందు తేజస్వీ మీడియాతో మాట్లాడారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపిస్తే.. మొదటి కేబినెట్ భేటీలోనే 10లక్షల ఉద్యోగాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పనికి తగ్గ వేతనం హామీని నెరవేస్తామన్నారు.
బిహార్ ప్రజలు, ఆర్జేడీ కార్యకర్తలు లాలూను మిస్ అవుతున్నారని ఈ సందర్భంగా రబ్రీదేవి వ్యాఖ్యానించారు.