తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓటు వేసేందుకు ట్రాక్టర్​ కిరాయికి తీసుకొని..

బిహార్​లోని ఓ గ్రామ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు విరాళాలు సేకరించి.. ట్రాక్టర్ కట్టుకుని పోలింగ్ స్టేషన్​కు​ వెళ్లారు. ఈసారి ఎవరు గెలిచినా ఊళ్లో రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు. సరైన రోడ్డు లేక ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నామని, ఆస్పత్రికి వెళ్లే క్రమంలో కొందరు మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Bihar elections: Kauakole people hire tractor to reach polling station
ఓటు వేసేందుకు విరాళాలతో ట్రాక్టర్​ కట్టుకెళ్లిన గ్రామస్థులు

By

Published : Oct 29, 2020, 5:04 AM IST

పోలింగ్ కేంద్రం దగ్గర్లోనే ఉన్నా కొందరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ బిహార్ నవాదా జిల్లా కవాకోల్ ప్రాంతంలోని ధనియా గోరిహియా గ్రామస్థులు మాత్రం టాక్టర్ కట్టుకొని పోలింగ్​ బూత్​కు వెళ్లారు. సాయంత్రం వరకు లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాక్టర్​ కిరాయికి తమవద్ద డబ్బులు లేకపోతే విరాళాలు సేకరించి.. రవాణా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈసారి ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిచినా తమ గ్రామంలో రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు గ్రామస్థులు. అందుకే అధ్వాన్నంగా ఉన్న రోడ్డు మార్గం ద్వారానే 36 కి.మీ ట్రాక్టర్​లో ప్రయాణించి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. సరైన రోడ్డు సదుపాయం లేని కారణంగా ఎన్నో అవస్థలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో భుజాలపైనే రోగులను ఆస్పత్రికి తరలిస్తామని.. కొంత మంది మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయేవారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

మొదట్లో ధనియాలో పోలింగ్ కేంద్రం ఉండేదని కానీ, ఈ మధ్యే పచాంబకు మార్చారని గ్రామస్థులు తెలిపారు. ఈ గ్రామం బిహార్​లో నక్సల్స్​ ప్రభావం అధికంగా ఉన్న గోవిందాపుర్​ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఓటర్లు మాత్రం ఎలాంటి భయాందోళనలు లేకుండా ఈసారి ఉత్సాహంతో భారీగా ఓటింగ్​లో పాల్గొన్నారు. ఇక్కడ పోలింగ్ 72.2 శాతంగా నమోదైంది.

ఓటు వేసేందుకు ట్రాక్టర్​పై వెళ్తున్న గ్రామస్థులు

గోవిందాపుర్​లో జేడీయూ తరఫున పూర్ణిమా యాదవ్ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన ఆర్జేడీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి ఆర్జేడీ తరఫున మహమ్మద్ కమ్రాన్ పోటీ చేస్తున్నారు. ఎల్​జేపీ నుంచి రంజిత్ యాదవ్​ నిలబడ్డారు.

ABOUT THE AUTHOR

...view details