బిహార్ ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కరోనా సంక్షోభంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం వల్ల బిహార్వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 2.14కోట్ల మంది ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
బిహార్ బరి: తొలి విడత ఎన్నిక నేడే - Bihar Election 2020: 71 seats in Bihar go to polls today
బిహార్ తొలి విడత ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 71 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
బిహార్ బరి: తొలి విడత ఎన్నిక నేడే
కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల శానిటైజేషన్ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.