తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రమాణం చేసిన 3 రోజులకే మంత్రి రాజీనామా - బిహార్​ ప్రభుత్వం

నితీశ్​ కుమార్​ ప్రభుత్వంలో 3 రోజుల క్రితం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవాలాల్​ చౌధరీ రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Bihar education minister resigns over corruption taint
బిహార్​ విద్యాశాఖ మంత్రి రాజీనామా

By

Published : Nov 19, 2020, 4:51 PM IST

బిహార్​ ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మంత్రి.. తన పదవి నుంచి వైదొలిగారు. అవినీతి ఆరోపణలతో విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌధరీ రాజీనామా చేశారు. 3 రోజుల క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు మంగళవారం.. విద్యాశాఖను కేటాయించారు. అయితే.. గురువారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు చేపట్టగా.. గంటల వ్యవధిలోనే ఆయన పదవి నుంచి వైదొలగడం గమనార్హం.

తారాపుర్​ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్​.. గతంలో బిహార్​ భగల్​పుర్​లోని​ వ్యవసాయ వర్సిటీకి వైస్​ ఛాన్స్​లర్​గా పనిచేశారు. ఆ సమయంలోనే బిహార్​ అగ్రికల్చరల్​ యూనివర్సిటీలో టీచర్లు, టెక్నీషియన్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల విమర్శల నడుమ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details