తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​ డీజీపీ వీఆర్​ఎస్​- అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ!

బిహార్​ డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్​(డీజీపీ) గుప్తేశ్వర్​ పాండే.. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోటీ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Bihar DGP takes voluntary retirement
బిహార్​ డీజీపీ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ

By

Published : Sep 23, 2020, 12:26 PM IST

Updated : Sep 23, 2020, 12:50 PM IST

అసెంబ్లీ ఎన్నికల వేళ.. బిహార్​లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ రాష్ట్ర డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ పోలీస్​(డీజీపీ) గుప్తేశ్వర్​ పాండే.. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గుప్తేశ్వర్​ వాలంటరీ​ రిటైర్మెంట్​ను.. ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్​​ ఆమోదించినట్టు హోంశాఖ వెల్లడించింది. ఈయన స్థానంలో ప్రస్తుతం డీజీ(హోంగార్డ్​)గా ఉన్న ఎస్​కే సింఘాల్​కు డీజీపీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.

1987వ బ్యాచ్​ ఐపీఎస్​ అధికారి పాండే.. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

'అలాంటిదేమీ లేదు'

అయితే.. తానిప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదని పాండే తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయాలేవీ తీసుకోలేదన్న పాండే.. రాజకీయాల్లో చేరకుండానే సమాజ సేవ చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఒక్కరోజు దీక్ష విరమించిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

Last Updated : Sep 23, 2020, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details