తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడిగితే ఇవ్వలేదు... ఇస్తే తీసుకోలేదు - బిహార్​

బిహార్​లో మంత్రివర్గాన్ని విస్తరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. జేడీయూకి చెందిన 8 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మిత్రపక్షమైన భాజపాకు మంత్రివర్గంలో చోటిచ్చినా... ఆ పార్టీ నేతలు చేరలేదు. అయితే... కమలదళంతో ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించారు నితీశ్​.

బిహార్​లో భాజపా-జేడీయూ కూటమికి బీటలు

By

Published : Jun 2, 2019, 1:58 PM IST

Updated : Jun 2, 2019, 5:21 PM IST

కమలదళంతో జేడీయూ విభేదాలు

బిహార్​లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా-జేడీయూ మధ్య కలహాలు తీవ్రమయ్యాయా? అన్యోన్యంగా ఉంటున్న రెండు పార్టీల మధ్య కేంద్రమంత్రి పదవులకై చిచ్చు ఏర్పడిందా? తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి జేడీయూ ప్రతినిధులెవరూ హాజరవకపోవడం, తాజాగా బిహార్​ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇచ్చినప్పటికీ భాజపా నేతలు చేరకపోవడం ఈ వార్తలకు మరింత ఊతమిస్తోంది.

మంత్రివర్గ విస్తరణలో చేరని భాజపా

బిహార్​లో మంత్రివర్గాన్ని విస్తరించారు ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. కొత్తగా నేడు 8 మందితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరంతా జేడీయూ నేతలే. మిత్రపక్షమైన భాజపాకు నితీశ్​ కుమార్​ మంత్రి పదవి ఇచ్చినా... మంత్రివర్గంలో చేరేందుకు వారు ఆసక్తి కనబరచలేదు.

సుశీల్​ కుమార్​ మోదీ ట్వీట్​

"ఖాళీగా ఉన్న మంత్రి పదవి భాజపాకు ఇస్తామని నితీశ్​ కుమార్​ చెప్పారు. అయితే భవిష్యత్తులో మంత్రి పదవిని తీసుకోవాలని భాజపా భావించింది."
- సుశీల్​ కుమార్​ మోదీ, బిహార్​ ఉపముఖ్యమంత్రి

నితీశ్​ స్పందన

భాజపా-జేడీయూ కూటమిపై వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చారు ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​. మంత్రివర్గంలో భాజపాకు అవకాశం ఇచ్చినా ఆ పార్టీ నేతలే ముందుకు రాలేదని చెప్పారు. భాజపాతో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు నితీశ్​.

అలా మొదలైంది...

ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూకు బిహార్​లో 16 మంది లోక్​సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయినా... మోదీ మంత్రివర్గంలో ఆ పార్టీ నేతలు ఎవరూ చేరలేదు. పదవుల పంపకంపై భాజపా-జేడీయూ మధ్య చర్చలు విఫలమవడమే ఇందుకు కారణం. రెండు పార్టీల బంధంపై అలా మొదలైన చర్చ... ఇప్పుడు బిహార్​ మంత్రివర్గ విస్తరణతో మరింత విస్తృతమైంది.

నితీశ్​కు భాజపా తప్పనిసరి

243 మంది ఎమ్మెల్యేలున్న బిహార్​ అసెంబ్లీలో ప్రస్తుతం జేడీయూ(73), భాజపా(54), ఎల్​జేపీ(2), ఐఎన్​డీ(4) కూటమిగా ఏర్పడి మొత్తం 133 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీ(79), కాంగ్రెస్​(27) కూటమికి మరిన్ని స్థానిక పార్టీలతో కలిపి మొత్తం 110 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ భాజపా-జేడీయూ విభేదాలు మరింత ముదిరితే... నితీశ్​ కుమార్​ పదవికే ఎసరు వచ్చే ప్రమాదముంది.

ఇదీ చూడండి : తుపాకి తిరగేసి వైద్యునిపై దుండగుల దాడి

Last Updated : Jun 2, 2019, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details