బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎస్పీ) నేతృత్వంలోని కూటమికి పెద్ద చిక్కొచ్చిపడింది. కూటమిలోని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భరత్ బింద్.. శనివారం ఆర్జేడీలో చేరారు.
ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చారు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్. సంబంధిత చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నవ బిహార్ నిర్మాణంలో భాగంగా ఎన్డీఏను తరిమికొట్టడానికి.. బింద్ మద్దతు పలికారని పేర్కొన్నారు తేజస్వీ.
బీఎస్పీ, జనతా పార్టీ(సోషలిస్ట్)తో కలిసి ఆర్ఎల్ఎస్పీ అధినేత ఉపేంద్ర కుశ్వాహా బిహార్ ఎన్నికల కోసం కూటమిని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కుశ్వాహాకు తమ మద్దతు ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇదివరకే ప్రకటించారు. ఎన్డీఏ కూటమి, ఆర్జేడీ నేతృత్వంలోని 'మహాఘట్బంధన్'లను కాదని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. బింద్ బీఎస్పీని వీడటం పలు చర్చలకు తావిస్తోంది.
మాయావతి పార్టీలో ఇలాంటి ఆటుపోట్లు కొత్తేం కాదు. 2010లోనూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ మారారు.
ఇదీ చదవండి:'యూపీలో రామ రాజ్యం కాదు.. ఆటవిక రాజ్యమే'