బిహార్‌లో స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎస్టెట్)లో ఓ పురుషుడి ప్రవేశ పత్రంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫొటో ముద్రించడం చర్చనీయాంశమైంది.
పేరు రిషికేశ్.. బొమ్మ అనుపమ

మక్దుంపుర్కు చెందిన రిషికేశ్ కుమార్ ఉపాధ్యాయ అర్హత సంపాదించేందుకు ఎస్టెట్ పరీక్షకు ధరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 28న జరగబోయే పరీక్షకు హాజరయ్యేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు. అయితే పరీక్ష తేదీ దగ్గరపడుతుండగా ఆన్లైన్లో అడ్మిట్ కార్డులు విడుదల చేసింది బిహార్ బోర్డు. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్న రిషికేశ్ కంగుతిన్నాడు. తన పేరుతో ఉన్న హాల్‌టికెట్‌పై అనుపమ పరమేశ్వరన్ ఫొటో చూసి విస్తుపోయాడు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
ఇదీ చదవండి:వివాహం కోసం 12 కిలోమీటర్లు పరుగెత్తిన పెళ్లికొడుకు!