తెలంగాణ

telangana

By

Published : Aug 23, 2020, 4:17 PM IST

ETV Bharat / bharat

బిహార్ ఎన్నికల వాయిదాపై ఈసీ క్లారిటీ

బిహార్​లో అసెంబ్లీ ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు కోరతున్నప్పటికీ... అలా చేసే ఆలోచన లేదని స్పష్టం చేశాయి.

Bihar assembly polls on time: EC sources
ఎన్నికలు వాయిదా వేసేది లేదు!

కొవిడ్-19 కారణంగా వాయిదా పడతాయనుకున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్నికలు వాయిదా వేయాలని రాజకీయ పార్టీలు ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. ఆ ఆలోచన లేదని తేల్చిచెప్పాయి.

బిహార్ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ కరోనా కాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రశ్నించింది. ఇక లోక్ జనశక్తి, నేషనల్ పీపుల్స్ పార్టీలు సైతం ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి. అయినా... కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహించి తీరాలని ఈసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు

రాష్ట్రంలో 243 మంది ఎమ్మెల్యేల పదవీ కాలం నవంబర్ 29న ముగియనుంది. దీంతో, అక్టోబర్-నవంబర్ మధ్యలోనే ఎన్నికలు జరిగే సూచనలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే బిహార్ లో రాజకీయ పార్టీలకు కరోనా వేళ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది భారత ఎన్నిక సంఘం. నామినేషన్ దగ్గరి నుంచి ఓట్ల లెక్కింపు వరకు సరికొత్త ఎన్నికల నియమావళిని సిద్ధం చేసింది. కంటైన్మెంట్ జోన్ లో ఉన్న ఓటర్లకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ఒక వేళ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియక ముందు ఎన్నికలు నిర్వహించలేకపోతే.. వాయిదా వేసేందుకు న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఓ ధ్రువీకరణ పత్రాన్ని కోరనుంది ఈసీ.

ఇదీ చదవండి:'ఓటు'కు కొత్త రూటు వేసిన ఎన్నికల సంఘం

ABOUT THE AUTHOR

...view details