మూడు దశల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు 22 మంది నాయకులను ప్రచారకర్తలుగా నియమించారు. ఇప్పటికే 50 మంది అభ్యర్థులను బరిలోకి నిలిపిన ఉద్ధవ్.. వారికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
ఈ ప్రచార దళంలో మహారాష్ట్ర పర్యటక మంత్రి ఆదిత్య ఠాక్రేతో పాటు సుభాశ్ దేశాయ్, సంజయ్‌రౌత్, అనిల్‌దేశాయ్, వినాయక్ రౌత్, అరవింద్ సావంత్, ప్రియాంక చతుర్వేది, రాహుల్ షెవాలే వంటివారు ఉన్నారు. గతేడాది ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన శివసేన విడిగా పోటీ చేస్తోంది.