తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా టాప్​​గేర్​తో ఆ రాష్ట్రాల్లో మళ్లీ లాక్​డౌన్ - కర్ణాటకలో మళ్లీ లాక్​​డౌన్​

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్​డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి పలు రాష్ట్రాలు. బిహార్​వ్యాప్తంగా జులై 16 నుంచి 31 వరకు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్​ మోదీ ప్రకటించారు. అలాగే కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోనూ జులై 23 వరకు లాక్​డౌన్​ అమలు చేయనుంది యడ్డీ సర్కార్​.

Bihar announces total lockdown from July 16-31
కరోనా రివర్స్​గేర్​తో ఆ రాష్ట్రాల్లో మళ్లీ లాక్​డౌన్

By

Published : Jul 14, 2020, 5:17 PM IST

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ లాక్​డౌన్​ దిశగా అడుగులు వేస్తున్నాయి పలు రాష్ట్రాలు.

బిహార్​లో..

బిహార్​లో ఇటీవల కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,432 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రంలో ఒక్కరోజు వ్యవధిలో ఇప్పటివరకు ఇవే అత్యధికం.

ఈ తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మరోసారి లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ. జులై 16 నుంచి 31 వరకు లాక్​డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. లాక్​డౌన్​ మార్గదర్శకాలనూ విడుదల చేశారు. కొన్నింటికి మినహాయించి.. ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఉండదని ప్రకటించారు.

⦁ వ్యవసాయ పనులకు, ఇతర నిత్యవసర వస్తువుల కొనుగోలుకు అనుమతి

⦁ ప్రార్థనా మందిరాలు మూసివేత

కర్ణాటకలో..

కర్ణాటక కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కన్నడ జిల్లాలో జులై 15 రాత్రి 8 గంటల నుంచి జులై 23 ఉదయం 5 గంటల వరకు లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ఆ జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించింది.

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: వరద తాకిడికి కూలిపోయిన పాఠశాల భవనం

ABOUT THE AUTHOR

...view details