తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్​: 93కు చేరిన 'ఏఈఎస్​' మృతులు

బిహార్​లోని ముజఫర్​పుర్​లో అనుమానిత అక్యూట్​ ఎన్​సెఫాలిటిస్​ సిండ్రోమ్​ బారినపడి మరణించిన చిన్నారుల సంఖ్య 93కు చేరింది. సంఖ్య నానాటికీ పెరుగుతుండటం కలవరపెడుతోంది.

అంతకంతకూ పెరుగుతున్న 'ఏఈఎస్​' మృతులు

By

Published : Jun 16, 2019, 1:06 PM IST

Updated : Jun 16, 2019, 4:37 PM IST

బిహార్​లో అనుమానిత అక్యూట్​ ఎన్​సెఫాలిటిస్​ సిండ్రోమ్-ఏఈఎస్​ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముజఫర్​పుర్​లో నేడు మరికొందరు పసివాళ్లు ప్రాణాలు విడిచారు. ఫలితంగా... ఈ నెలలో ఏఈఎస్​కు బలైన వారి సంఖ్య​ 93కు చేరింది.

కేంద్ర మంత్రి పర్యటన...

కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్ ముజఫర్​పుర్​లో పర్యటించారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు.
మరణించిన చిన్నారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్​కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

పదేళ్ల లోపు చిన్నారులే...

పదేళ్ల లోపు చిన్నారులే ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. జూన్​ 1 నుంచి 197 మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరారు. బిహార్​లోని 12 జిల్లాల్లో 222 ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

వైద్యులు మాత్రం... చిన్నారుల మృతికి ఏఈఎస్(మెదడు వాపు వ్యాధి)​ కారణం కాదని, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం(హైపోగ్లైసీమియా) వల్లనే వారు చనిపోతున్నారని చెప్పారు. "గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, ఇతర కారణాల వల్ల రాత్రిపూట పిల్లలు ఆహారం తీసుకోవడంలేదు. ఇలా ఖాళీ కడుపుతో నిద్రపోతే పిల్లల రక్తంలో గ్లూకోజ్​ స్థాయిలు తగ్గే ప్రమాదముంది" అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Last Updated : Jun 16, 2019, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details