బిహార్లోని ముజాఫర్పూర్లో 'ఎక్యూట్ ఎన్సెఫాలిటీస్ సిండ్రోమ్' (మెదడు వాపు) తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం 38 మంది ఈ వ్యాధితో స్థానిక శ్రీ కృష్ణ ఆసుపత్రిలో చేరగా... వీరిలో 14 మంది చనిపోయారని మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారేనని వైద్యులు నిర్ధరించారు. ఈ వ్యాధి సాధారణంగా వర్షాకాలంలో నీటి వలన వస్తుందని తెలిపారు.
మెదడువాపు లక్షణాలు