వేగంగా దూసుకొస్తున్న రైలును ఆపి ఐదుగురి ప్రాణాలను కాపాడిన ఘటన బిహార్ లఖిసరాయ్ జిల్లా దైతా డ్యామ్ రైలు గేటు వద్ద జరిగింది.
రైలును ఆపి.. ఐదుగురి ప్రాణాలు కాపాడారు - Train accident news
బిహార్‌లో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల మధ్యలో చిక్కుకుపోయిన పాఠశాల వాహనాన్ని గమనించిన స్థానికులు.. అదే సమయంలో వస్తున్న రైలును ఆపి, ఐదుగురి ప్రాణాలు కాపాడారు.

రైలును ఆపి-ఐదుగరి ప్రాణాలు కాపాడారు!
ఓ పాఠశాల వాహనం రైలు పట్టాల మధ్యలో చిక్కుపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్‌పై ఓ ప్యాసింజర్ రైలు దూసుకొస్తోంది. దీన్ని గమనించిన స్థానికులు.. వాహనం వద్దకు చేరుకుని ఎర్రని వస్త్రాన్ని ఊపి రైలును ఆపారు. అనంతరం ఆ వాహనాన్ని బయటకు నెట్టి.. ఐదుగురి ప్రాణాలు కాపాడారు. పెను ప్రమాదమే తప్పింది. దీంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
రైలును ఆపి-ఐదుగరు ప్రాణాలు కాపాడారు