తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ధిక్కరణ కేసు తీర్పుపై పునఃసమీక్ష కోరిన భూషణ్

కోర్టు ధిక్కరణ కేసు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు న్యాయవాది ప్రశాంత్ భూషణ్​. ఈమేరకు రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

Bhushan files fresh plea in SC seeking review of punishment in contempt case
భూషణ్​ కేసు పునఃసమీక్షించాలని సుప్రీంలో పిటిషన్​

By

Published : Oct 1, 2020, 5:02 PM IST

కోర్టు ధిక్కరణ కేసులో తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును కోరారు సీనియర్​ న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. ఈమేరకు రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

న్యాయ వ్యవస్థను కించ పరిచేలా ట్వీట్లు చేసిన కేసులో ఆగస్టు 14న ప్రశాంత్​ను దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఆగస్టు 31న రూ.1 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే 3 నెలలు జైలు శిక్ష, న్యాయవాదిగా ప్రాక్టీసు చేయడంపై మూడేళ్ల నిషేధం తప్పదని హెచ్చరించింది.

రూ.1 జరిమానా ఇప్పటికే చెల్లించిన భూషణ్... ఆగస్టు 14, ఆగస్టు 31న ఇచ్చిన ఉత్తర్వులపై సమీక్ష కోరుతూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

  • ఇవీ చదవండి:

అసలెవరీ ప్రశాంత్‌ భూషణ్​? ఆయన ఏమన్నారు?

రూ.1 జరిమానా చెల్లించిన భూషణ్

ABOUT THE AUTHOR

...view details