అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమానికి సంబంధించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు స్పష్టతనిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీతో సహా 175 మంది ప్రముఖులను భూమిపూజకు ఆహ్వానించినట్లు తెలిపింది.
"ప్రధాని నరేంద్రమోదీ మొదట హనుమాన్‌గడి మందిర్‌ను దర్శిస్తారు. తర్వాత శ్రీ రామ్‌లల్లా వద్ద పూజలు నిర్వహిస్తారు. అనంతరం భూమిపూజ చేస్తారు. భూమిపూజ కోసం 2 వేల తీర్థ స్థలాలు, 100 నదుల నుంచి మట్టిని తీసుకొచ్చాం. శంకరాచార్య, అనేక మంది సాధువులు భూమిపూజ వస్తువులను పంపారు."
- శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు