కేరళ వరదల్లో ఆవాసం కోల్పొయినవారికి ఇళ్లు కట్టించేందుకు రామోజీ గ్రూపు సంస్థలు నడుం బిగించాయి. శనివారంనాడు అలప్పుయా(అలెప్పీ)లో ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉపాధ్యక్షుడు రాజాజీ, కుటుంబశ్రీ మిషన్ జిల్లా కార్యకర్తలు హాజరయ్యారు.
కుటుంబశ్రీ మిషన్ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మూడు నెలల్లో పనులు పూర్తయ్యేలా ఉన్నాయని డీఎన్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. దాతలు ఇచ్చిన ప్రతి రూపాయి బాధితులకు చేరుతుందని హామీ ఇచ్చారు.