తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్యపై ఐపీఎస్​ దాడి​.. విధుల నుంచి సస్పెండ్​ - IPS domestic violence video viral

మధ్యప్రదేశ్​కు చెందిన సీనియర్​ ఐపీఎస్​ ఆఫీసర్​ తన భార్యపై దాడి చేసిన వీడియో ప్రసుత్తం వైరల్​గా మారింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో డీజీ స్థాయి అధికారి తన​ భార్యను చితకబాదాడు. తనను ఎవరూ చూడట్లేదని రెచ్చిపోయిన ఆయనను ఇంట్లోని నిఘానేత్రం పట్టించింది.

Bhopal: DG Purushottam Sharma tortures & assaults wife, Caught on camera
భార్యపై ఐపీఎస్​ దాడి​.. విధుల నుంచి సస్పెండ్​

By

Published : Sep 28, 2020, 7:17 PM IST

మధ్యప్రదేశ్​కు చెందిన డీజీ స్థాయి ఐపీఎస్​ అధికారి.. తన భార్యపై దాడి చేయడం కలకలం రేపింది. అడిషినల్​ డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్న పురుషోత్తం శర్మ ఇటీవల తన భార్యపై అమానుషంగా దాడి చేసిన వీడియో వైరల్​గా మారింది.

భోపాల్​లోని నివాసంలో తన భార్యతో మాటామాటా పెరిగి సహనం కోల్పోయిన ఆయన తన సతీమణిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇంట్లో ఉన్న పనివారు నిలువరించే ప్రయత్నం చేయగా వారిపైనా అరిచారు. సంబంధిత దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

భార్యపై ఐపీఎస్​ దాడి​.. విధుల నుంచి సస్పెండ్​

మా నాన్నపై చర్యలు తీసుకోండి..

విషయం తెలుసుకున్న పురుషోత్తం శర్మ కుమారుడు పార్థు... తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. తన తల్లిపై దాడి చేసిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు. దీన్ని తీవ్రం​గా పరిగణించిన చౌహాన్​ ప్రభుత్వం ఆయన్ను విధుల నుంచి తొలగించింది. కానీ ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.

"ప్రాసిక్యూషన్​ డీజీపీని విధుల నుంచి తొలగించాం. విచారణకు ఆదేశించాం. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు"

--- శివరాజ్​సింగ్​ చౌహాన్​, మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి

ముందునుంచే కలహాలు..

పురుషోత్తం శర్మ, అతని భార్యకు ముందు నుంచే కుటుంబ కలహాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో డీజీ సతీమణి 2008లోనే భర్త ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తమ మధ్య జరిగింది కేవలం కుటుంబ కలహంగా చూడాలని... తానేమి నేరం చేయలేదని శర్మ తెలిపారు. కావాలనే తన భార్య తనపై కుట్ర చేసి చాకచక్యంగా ఇరికించిందన్నారు.

వివాహేతర సంబంధమే కారణమా..?

ఇరువురి మధ్య జరిగిన గొడవకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. తన నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని విదేశీ టూర్లకు వెళ్లి వచ్చేదని శర్మ తెలిపారు. ఏ కారణం లేకపోతే తీసుకున్న మొత్తాన్ని ఎలా ఖర్చు చేశారో కుమారుడు పార్థు చెప్పాలన్నారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే.. 32 ఏళ్లుగా నాతో ఎందుకు కలిసి ఉన్నారని ప్రశ్నించారు.

సమాజానికి ఏం సందేశం​ ఇవ్వాలని..?

పోలీస్​శాఖలో ఉన్నతమైన స్థానంలో ఉన్న పురుషోత్తం శర్మ, తన భార్యను శారీరకంగా హింసించడం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని జాతీయ మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ రేఖా శర్మ ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్​ చౌహాన్​కు లేఖ రాశారు. శర్మపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రూ.2.5 కోట్ల విలువైన విగ్రహం చోరీ

ABOUT THE AUTHOR

...view details